
కొత్త నావికాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరణ
భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ప్రాంతీయ భద్రతా వాతావరణం సవాళ్లతో కూడుకున్నదని, దేశ భద్రతే ధ్యేయంగా అత్యున్నత కార్యాచరణ సంసిద్ధతను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. నౌకాదళ ఆధునీకరణ, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ప్రవేశపెట్టడం ద్వారా కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందిస్తానని స్వామినాథన్ ఉద్ఘాటించారు. ఆయన 1987లో నేవీలో చేరారు, పలు యుద్ధ నౌకలకు సారథ్యం వహించి, విశిష్ట సేవా మెడల్స్ అందుకున్నారు.




