గద్వాలలోని కృష్ణవేణి చౌక్ వద్ద వంశీ ఫోటో స్టూడియో సమీపంలో మద్యం సేవించిన వంశీ, అరవింద్, వసంత్ అనే ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.