హరియాణాలో ఇద్దరు వివాహిత మహిళలు తమ భర్తలను వదిలి నలుగురు పిల్లలతో కలిసి ఇళ్ల నుంచి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపుతోంది. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరి అనుబంధం క్రమంగా ప్రేమగా మారినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెప్టెంబరు 9న పిల్లలను వెంట తీసుకుని అదృశ్యమైన వారు.. ఇళ్లలోని సుమారు రూ.9 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను కూడా తీసుకెళ్లినట్లు భర్తలు ఫిర్యాదు చేశారు. మొబైల్లోని వాట్సాప్ చాటింగ్లలో ‘మై లవ్’, ‘మై క్యూట్ వైఫ్’ వంటి సందేశాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలిస్తున్నారు.