
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నందమూరి కుటుంబం నుంచి ఆమె పోటీ..?
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నందమూరి కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో సుహాసినిని రంగంలోకి దింపాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ద్వారా సుహాసిని ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే జూబ్లీహిల్స్ లో ఎవరినీ పోటీకి నిలబెట్టరాదని, ఎవరికీ మద్దతు ఇవ్వరాదని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో కూకట్పల్లి నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు.




