కూలీ నుంచి గ్రూప్-2 ఆఫీసర్‌గా ఎదిగి.. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహిళ

4296చూసినవారు
కూలీ నుంచి గ్రూప్-2 ఆఫీసర్‌గా ఎదిగి.. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహిళ
AP: కూలీ నుంచి గ్రూప్-2 ఆఫీసర్ వరకు ఎదిగిన విజయలక్ష్మి అనే మహిళ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామానికి చెందిన విజయలక్ష్మి పగలంతా కూలీ పనులు చేస్తూ, రాత్రిళ్లు చదువును కొనసాగించారు. ట్రాక్టర్ నడిపే భర్త ప్రమాదానికి గురికావడంతో కుటుంబంపై ఆర్థిక భారం పెరిగినా ఆమె వెనుకడుగు వేయలేదు. కష్టాలను ఎదురొడ్డి పట్టుదలతో చదివి గ్రూప్-2 పరీక్షల్లో విజయం సాధించి ASOగా ఎంపికయ్యారు. ఆమె విజయం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

సంబంధిత పోస్ట్