ప్రధాని మోడీ బయోపిక్ లో ఉన్ని ముకుందన్

32098చూసినవారు
ప్రధాని మోడీ బయోపిక్ లో ఉన్ని ముకుందన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా 'మా వందే' అనే బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మోడీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించనున్నారు. క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, మోడీ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం మోడీ బాల్యం నుండి ప్రధాని స్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని ఆవిష్కరించనుంది. ఉన్ని ముకుందన్ లుక్ కి ఇప్పటికే మంచి స్పందన వస్తోంది.

ట్యాగ్స్ :