జైలు నుంచి అసెంబ్లీకి.. బిహార్ ఎన్నికల ఫలితాల్లో విజయం

34చూసినవారు
జైలు నుంచి అసెంబ్లీకి.. బిహార్ ఎన్నికల ఫలితాల్లో విజయం
బిహార్‌ ఎన్నికల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మొకామా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ జైలు నుంచే పోటీ చేసి 28,206 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. జన్‌ సురాజ్‌ పార్టీ అభ్యర్థి దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో పోలింగ్‌కు ముందు అతను అరెస్టై జైలుకు వెళ్లినా, స్థానిక ఓటర్లు ఆయనకే పూర్తి మద్దతు తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనంత్ సింగ్‌పై 28 క్రిమినల్ కేసులు ఉండటం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్