ఇకపై పెన్షన్ లబ్ధిదారులందరికీ ఖాతాల్లోకే డబ్బులు!

23చూసినవారు
ఇకపై పెన్షన్ లబ్ధిదారులందరికీ ఖాతాల్లోకే డబ్బులు!
TG: చేయూత పథకంలో అక్రమాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై పెన్షన్‌ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 42 లక్షల మంది చేయూత పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో సగం మందికి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతుండగా, దివ్యాంగులు, వృద్ధులకు పంచాయతీ కార్యదర్శులు, బిల్‌ కలెక్టర్లు నగదు రూపంలో పింఛను ఇస్తున్నారు. మిగిలిన వారికి ప్రతినెలా తపాలా ఖాతా ద్వారా సొమ్ము చెల్లిస్తున్నారు. ఆగస్టు నుంచి పింఛన్ మొత్తాలు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్