ఇకపై డోర్లు క్లోజ్ చేశాకే బస్సులు నడపాలి: TGSRTC

15చూసినవారు
ఇకపై డోర్లు క్లోజ్ చేశాకే బస్సులు నడపాలి: TGSRTC
TG: మణుగురు డిపో కండక్టర్ ప్రవళిక మృతి నేపథ్యంలో సిబ్బందితో పాటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ కీలక చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సులన్నింటికీ డోర్లు ఏర్పాటు చేయాలని, డోర్లు క్లోజ్ చేశాకే బస్సులు ముందుకు కదలాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది అన్ని రకాల బస్సులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాగా బస్సులో చిల్లర విషయంలో వాగ్వాదం జరగ్గా ఓ ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళికను తోసివేయడంతో తీవ్ర గాయాలై.. చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్