తెలంగాణ ప్రభుత్వం ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించునుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది.