
నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య!
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 45 ఏళ్ల అరుణ్ పట్వా అనే వ్యక్తిని అతడి భార్య అత్యంత కిరాతకంగా హత్య చేసింది. తరచూ గొడవలు జరుగుతున్నాయనే కారణంతో రాత్రిపూట నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అంతటితో ఆగకుండా బయటి నుంచి తలుపుకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




