నెస్లే లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్‌ విక్రయాలపై FSSAI నిషేధం

25చూసినవారు
నెస్లే లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్‌ విక్రయాలపై FSSAI నిషేధం
నెస్లే ఇండియా తయారు చేసిన లో-ఫ్యాట్‌ డెయిరీ వైటనర్‌ విక్రయాలను FSSAI నిలిపివేయాలని ఆదేశించింది. న్యూఢిల్లీలోని ఓ హోటల్‌ నుంచి సేకరించిన నమూనాను పరీక్షించగా.. అది నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని ప్రయోగశాల నివేదికలో తేలినట్లు FSSAI తెలిపింది. ఈ ఉత్పత్తిని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌-2006 ప్రకారం నాన్‌-కంప్లయింట్‌గా గుర్తించింది. హోటల్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అయితే తమ ఉత్పత్తి సురక్షితమేనని నెస్లే ఇండియా స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్