కోతికి అంత్యక్రియలు.. మానవత్వాన్ని చాటుకున్న గ్రామస్థులు (వీడియో)

10చూసినవారు
TG: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు గ్రామస్థులు ఒక కోతికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఊరిలో ఈరోజు ఒక వానరం మృతి చెందగా.. గ్రామస్థులంతా ఏకమై మంగళవాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. వానరాన్ని హనుమంతుడి స్వరూపంగా భావిస్తామని, అందుకే ఇలా అంత్య క్రియలు పూర్తి చేశామని సర్పంచ్ నాగేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్