అన్ని కార్పొరేషన్లలో జి+5 ఇందిరమ్మ టవర్లు: మంత్రి పొంగులేటి

42చూసినవారు
అన్ని కార్పొరేషన్లలో జి+5 ఇందిరమ్మ టవర్లు: మంత్రి పొంగులేటి
TG: దీపావళి వేళ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కార్పొరేషన్ల పరిధిలో జి+5 ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. తొలి విడతలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ కార్పొరేషన్లలో ఈ నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి దీపావళి లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' అనే కాన్సెప్ట్‌తో లబ్ధిదారుల ఇళ్లల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్