
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభం అయింది. 4,332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రిజర్వేషన్లు, ఇతర సమస్యలతో 6 గ్రామాల్లో ఎన్నికలు జరగటం లేదు. దీంతో 3,911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే 29,913 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ మధ్యాన్నం 1 గంట వరకు జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.



































