జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం దేవ బండ గ్రామానికి వెళ్లిన
బీజేపీ నాయకులు, రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఐజ ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు బోయ రామకృష్ణను శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, ఐజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ, పట్టణ అధ్యక్షులు నరసింహ లక్ష్మణ్ గౌడ్, రజక నరసింహులు, ప్రదీప్ శెట్టి, లక్ష్మన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.