వడ్డేపల్లి: విద్యుత్ సరఫరాపై డీఈ తిరుపతి రావు ఆకస్మిక తనిఖీ

409చూసినవారు
వడ్డేపల్లి: విద్యుత్ సరఫరాపై డీఈ తిరుపతి రావు ఆకస్మిక తనిఖీ
వడ్డేపల్లి పురపాలిక పరిధిలోని శాంతి నగర్, ఇందిరా నగర్లలో ప్రజా బాటలో భాగంగా విద్యుత్ సరఫరాపై డీఈ తిరుపతి రావు ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి, రాజోలి రోడ్ వైపు విధుల్లో ఉన్న చెట్లను తొలగించాలని సూచించారు. నిధులు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని, వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరఫరా సరిగా లేకుంటే ఫిర్యాదు వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఏడీ నవీన్ బాబు, ఏఈ సుబ్బారాయుడు, లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, లైనమెన్లు, సిబ్బంది, పుర ప్రజలు, వినియోగదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్