ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం–వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రబీ 2026–27 సీజన్‌కు 100 శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ రైతుల పెట్టుబడి భారం తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోందని, రైతులు
సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.