పొలం విషయంలో గొడవ

2232చూసినవారు
పొలం విషయంలో గొడవ
అలంపూర్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన శ్రీను అలంపూర్ అక్బర్పేట్ కాలనీకి చెందిన హాజీ భాష గత కొన్ని రోజుల క్రితం పొలం విషయంలో గొడవపడ్డారు. ఈ విషయమై శ్రీను మాట్లాడుతూ పొలం భూభారతి వెబ్సైట్లో కూడా తన తల్లి అయిన కోనేరు లక్ష్మీ దేవమ్మ పేరు మీద ఉందన్నారు. రాత్రి వేళలో హాజీ భాష అతని తమ్ముడు వచ్చి పొలంలో విత్తనం వేయడం వలన గొడవ మొదలైందని అన్నారు. ఇందులో మేము ఎటువంటి డబ్బులు అతని దగ్గర తీసుకోలేదని తెలిపారు. దీనిపైన సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై రామకృష్ణ కు వివరణ కోరగా మొత్తం ఆరు మందిపై బైండోవర్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్