మానవపాడు మండలం పెద్ద పోతులపాడు శివారు-అలంపూర్ రైల్వే స్టేషన్ మధ్య ఆదివారం ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడు. మృతుడి వయసు 30-35 ఏళ్లు ఉంటుందని, ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు.