అలంపూర్ మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదో వార్డుకు చెందిన వై రజిత భర్త వై కుమార్, రెండు నెలల క్రితం ఓటర్ ఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఓటర్ ఐడి అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే స్పందించి తన భార్య ఓటర్ ఐడి కార్డును త్వరగా అందేలా చూడాలని ఆయన కోరారు.