గద్వాల్ జాతరకు ఏర్పాట్లు పూర్తి

4చూసినవారు
గద్వాల్ జాతరకు ఏర్పాట్లు పూర్తి
గద్వాల పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల (గద్వాల జాతర) సందర్భంగా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సతీమణి జ్యోతి శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. చేనేత కార్మికులు తయారుచేసిన పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు వేద బ్రాహ్మణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, చేనేత కార్మికులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్