Jan 12, 2026, 15:01 IST/
కల్కి 2898 AD సీక్వెల్: వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్
Jan 12, 2026, 15:01 IST
భారతీయ సినీ చరిత్రలో 'కల్కి 2898 AD' ఒక అద్భుత విజయం సాధించింది. పురాణ ఇతిహాసాలను, సైన్స్ ఫిక్షన్‌ను జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. వచ్చే నెల నుండి 'కల్కి 2' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ ఫిబ్రవరి మొదటి వారం నుండి షూటింగ్‌లో పాల్గొంటారు. మొదటి భాగంలో 7 నిమిషాలు మాత్రమే కనిపించిన కమల్ హాసన్, ఈ సీక్వెల్‌లో పూర్తి స్థాయిలో కనిపించనున్నారు. మొదటి భాగంలో హీరోయిన్‌గా నటించిన దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు.