పాలమూరు యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రో. జీఎన్. శ్రీనివాస్ ని గురువారం గద్వాల జిల్లా బీఆర్ఎస్వి కో-ఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్వి పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్ బాబు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీలో నూతన హాస్టల్ భవనాలను నిర్మించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు.