గద్వాల్ జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ల కలకలం

0చూసినవారు
గద్వాల్ జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ల కలకలం
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఎర్రవల్లి మండలం షేక్ పల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం అల్పాహారంగా వడ్డించిన జీరా రైస్ తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.