జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులకు ఆధార్ కార్డులు జారీ చేసేందుకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంగళవారం ఐ డి ఓ సి లో జరిగిన జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నకిలీ ధ్రువీకరణ పత్రాలకు తావులేకుండా, నిబంధనల ప్రకారమే ఆధార్ అప్డేట్లు చేయాలని, జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగానే పుట్టిన తేదీని నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, డీఈవో విజయలక్ష్మి, డీఎం అండ్ హెచ్ ఓ సంధ్య కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.