కమిటీ హాల్ గోడలను కూలగొట్టిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి.. మత్స్యకారుల సంఘం

0చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల్ పట్టణ కేంద్రంలోని 2వ రైల్వే గేట్ వద్ద గల తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం కమిటీ హాల్ స్థలంలోకి అక్రమంగా చొరబడి, అనుమతి లేకుండా కాంపౌండ్ గోడను కూలగొట్టిన విజయవాడ వెంకటరాములు, అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో గద్వాల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో SI కళ్యాణ్ కుమార్ కు లిఖితపూర్వకంగా శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది.

సంబంధిత పోస్ట్