చేనేత కళాకారుడి కుటుంబానికి ఐజ చేనేత సహకార సంఘం ఆర్థిక సహాయం

693చూసినవారు
చేనేత కళాకారుడి కుటుంబానికి ఐజ చేనేత సహకార సంఘం ఆర్థిక సహాయం
ఐజ మున్సిపాలిటీ పరిధిలోని కనికపేటకు చెందిన చేనేత కళాకారుడు కనికే నరసింహులు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు ఐజ చేనేత సహకార సంఘం రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం అందజేసింది. సంఘం అధ్యక్షుడు డాన్ వీరన్న, కార్యదర్శి పసలాది బసవరాజు, కోశాధికారి కసా వెంకటేష్, డైరెక్టర్ రియాజుద్దీన్, మేనేజర్ సత్యనారాయణ తదితరులు మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్