జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పై వేసిన సిమెంట్ బెడ్ ను ధ్వంసం చేసిన కేసులో నిందితుడు నాగరాజుకు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ ఏడీజే కోర్టు ఒక నెల జైలు శిక్షతో పాటు రూ. 1, 000 జరిమానా విధించింది. 2022లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువవడంతో శిక్ష విధించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.