జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలంలోని పులికల్ గ్రామంలోని రైతు పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో దొంగలు కాపర్ వైర్లను దొంగిలించారు. రైతుల వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్ ఫార్మర్ లో, రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత దొంగలు ఆయిల్ బయటకు తీసి, లోపల ఉన్న కాపర్ వైర్లను తొలగించి తీసుకెళ్లారు. ఆదివారం మోటర్లు ఆన్ చేయడానికి వచ్చిన రైతు ట్రాన్స్ ఫార్మర్ దెబ్బతిన్న విషయాన్ని గుర్తించి షాక్ కు గురయ్యారు.