అలంపూర్: జాతీయ రహదారిపై పత్తి రైతుల ధర్నా

1008చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి స్టేజ్ సమీపంలోని జాతీయ రహదారి-44 పై గురువారం రాత్రి పత్తి రైతులు ధర్నా చేపట్టారు. పత్తి నల్లగా ఉందని కొనుగోలు చేయనందుకు నిరసనగా, 25 మంది రైతులను రిజెక్ట్ చేసిన కారణంతో కర్నూలు-హైదరాబాద్ వెళ్లే రోడ్డుపై రైతులు బైఠాయించారు. అధికారులు కొనుగోలు చేయనప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రం ఎందుకని ఆగ్రహించిన రైతులు రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.

సంబంధిత పోస్ట్