జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రంలో నూతన సంవత్సరం-2026 సందర్భంగా ప్రజలు భారీగా తరలిరావడంతో గురువారం ట్రాఫిక్ సమస్య తలెత్తింది. షేకుపల్లి, సాసనూలు, దువాసిపల్లికి వెళ్లే రోడ్డులో అరకిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దుకాణాల ముందు వాహనాల పార్కింగ్తో సమస్య మరింత తీవ్రమైందని, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికులు తెలిపారు.