సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లే ప్రజలతో శనివారం సాయంత్రం 44వ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాల తాకిడి పెరగడంతో అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి చౌరస్తా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో స్థానికులు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులు సంయమనంతో వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.