అలంపూర్: భూవివాదం... రాళ్లు, గొలుసులతో దాడి.!

1362చూసినవారు
అలంపూర్: భూవివాదం... రాళ్లు, గొలుసులతో దాడి.!
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి శివారులో భూవివాదం మంగళవారం ఘర్షణకు దారితీసింది. చిన్నపోతులపాడు గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఈ దాడిలో నాయిక శివ, ప్రవీణ్ కుమార్, మణిశంకర్ తీవ్రంగా గాయపడ్డారు. రాఘవేంద్ర రైస్ మిల్లు వద్ద ఆటోను అడ్డగించి రాళ్లు, ఇనుప గొలుసులతో దాడి జరిగినట్లు సమాచారం. ఉండవెల్లి ఎస్ఐ ఆర్. శేఖర్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్