జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం 44వ జాతీయ రహదారి వద్ద సోమవారం రాత్రి పెట్రోల్ బంక్ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. కారులో వచ్చిన వ్యక్తులకు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరగగా, తాము రాజకీయ నాయకుల అనుచరులం అని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ పోలీసు సిబ్బందిపై కూడా దౌర్జన్యం చేశారు.