జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో హరిత టూరిజం హోటల్ వద్ద కాశీపురం గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తి సంచిలో 8 లీటర్ల మద్యం తరలిస్తుండగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 8900 ఉంటుందని ఎస్ఐ తెలిపారు.