జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఉత్తనూరు గ్రామ పంచాయతీలో, సర్పంచ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారితో, మరో సామాజిక వర్గం నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని సర్పంచ్ భర్త రామలింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని ఎన్నికల అధికారులు, పోలీసులను వేడుకున్నారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.