జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం అమరవాయిలో కొన్ని రోజులుగా నెమళ్లు సంచరిస్తున్నాయి. ఉదయం వేళల్లో ఇళ్ల మధ్యలోనే నెమళ్లు దర్శనమిస్తున్నాయి. పెంచుకున్న జంతువుల మాదిరిగా ప్రతిరోజు ఇళ్ల ముందుకు రావడం సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. వాటికి ఎవరూ హాని కలిగించడం లేదని, సాయంత్రం కాగానే అవి పొలాల వైపు వెళ్లిపోతున్నాయని వారు పేర్కొన్నారు.