అలంపూర్: ఉప్పొంగిన పెద్దవాగు... రాకపోకలకు అంతరాయం

1248చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శనివారం టీటీ దొడ్డి గ్రామ సమీపంలోని పెద్ద వాగు ఉప్పొంగడంతో కుట్కనూరు, సింధనూరు వంటి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు నిలిచిపోయారు. ప్రజలు చాలా కాలంగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్