జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలంలోని వల్లూరుపేటలో పోలీసులు పేకాట ఆడుతున్న శిబిరంపై మెరుపు దాడి నిర్వహించారు. దర్గా పక్కన సీసీ రోడ్డుపై జూదమాడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 14,430 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని అయిజ పోలీస్ స్టేషన్‌కు తరలించి, జూదం చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.