జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలోని అయిజ రోడ్డులో శనివారం, రాయచూర్ రైల్వే లైన్ ట్రాక్ దగ్గర అయిజ వైపు నుంచి గద్వాల వైపు వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైనప్పటికీ, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కారు యజమాని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.