గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి: మంజుల ధర్మ

2చూసినవారు
గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి: మంజుల ధర్మ
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్, గద్వాల్ లోని శాంతినగర్ లోని జమ్మలమడుగు ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఏఐ స్టెతస్కోప్ హార్ట్ చెకప్ కార్యక్రమంలో వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ పాల్గొన్నారు. గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైనదని, గుండె సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే నివారణ సులభమవుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్