జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ లోని మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగాలు, ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత దేశం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.