కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేస్తోంది.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు

12చూసినవారు
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేస్తోంది.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు
గద్వాల పట్టణంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేయడమే నైజమని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమైనదని, దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పష్టత ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ విమర్శలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించడమేనన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బండల వెంకట రాములు, రవి కుమార్, ఎక్బోటే, బాబుల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్