జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ఒంటిమిట్ట నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వాహనం ఉండవల్లి శివారులోని కాటన్ మిల్ వద్ద నివసిస్తున్న కార్మికుల గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భాగ్యమతి అనే మహిళ, వీరాసింగ్ యాదవ్ దంపతులకు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.