గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో NH-44పై ఏప్రిల్ 27న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. వరిగడ్డి ట్రాక్టర్‌ను డీసీఎం ఢీకొన్న ఘటనలో వడ్డేపల్లి మండలం కోయిల్ దిన్నే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి అక్కడికక్కడే మరణించగా, చంద్రమోహన్ రెడ్డి హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకుంది.