పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన సౌరవ్ రామ్ (24) అనే యువకుడు రామసేతు నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేపట్టారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగింది. లోక కళ్యాణం కోసం మూడు నెలలపాటు నీళ్లు, పళ్లు, బ్రెడ్, పాలు మాత్రమే తీసుకుంటూ జనవరి 2 లోపు అయోధ్యకు చేరుకుంటానని తెలిపారు.