గద్వాల: సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

705చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ వద్ద హెలిపాడ్, ఇతర పనులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం పరిశీలించారు. రిజర్వాయర్ నుంచి పంప్ హౌస్ కు వెళ్లే దారి మరమ్మత్తు పనులు పూర్తయ్యాయని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును నియమించామని కలెక్టర్ తెలిపారు. అంబులెన్స్, ఫైర్ వాహనం, వైద్య సేవలకు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు, ముఖ్య అతిథుల ఆహ్వానం నుండి వీడ్కోలు వరకు ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you