గద్వాల: జాతీయ రహదారి(NH-44)పై బస్సు బోల్తా

0చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు వద్ద జాతీయ రహదారి (NH-44)పై శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. హిందూపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ బస్సు, అనంతపురం నుంచి జమ్మూ కశ్మీర్ వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్