గద్వాల: CBUD app ను వినియోగించుకోవాలి: కలెక్టర్

699చూసినవారు
గద్వాల: CBUD app ను వినియోగించుకోవాలి: కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన స్థాయి టెలికాం కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు, టెలికాం సేవలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపరచడం, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి త్రైమాసికంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, మున్సిపల్ వంటి శాఖలు టెలికాం సేవలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్